Valentine Day : రిలేషన్ పై వర్రీ వద్దు.. డిప్రెషన్ అసలే వద్దు.. ఇలా బయటకు రండి.. 

Valentine Day : రిలేషన్ పై వర్రీ వద్దు.. డిప్రెషన్ అసలే వద్దు.. ఇలా బయటకు రండి.. 

తన లవర్ హ్యాండివ్వడంతో జీవితమే వ్యర్థమైందని బాధపడుతున్నాడు సునీల్.. 'ఇన్నాళ్లూ నేనే తన ప్రాణం అంటూ తిరిగాడు. ఇప్పుడు వేరే అమ్మాయితో కనిపించాడని బాధపడుతూ తన స్నేహితురాలితో చెప్పింది మైథిలి. తానింక బతకలేనంటూ బాధపడింది.

'మీరు ఎప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారో మాకు అనవసరం, నువ్వు మాత్రం మేం చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి' అంటున్నారు రాకేష్ అమ్మా నాన్నలు. అది భరించలేక దుర్వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఇలా ఏవో కారణాల వల్ల ప్రేమ బ్రేకప్​అయి దాని వల్ల బాధపడుతున్న వాళ్లెందరో

నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు

 జ్యోతి..గిరి.   జ్యోతి వాళ్లింట్లో" వాళ్లని కూడా ఒప్పించింది. ఇంతలో గిరికి యూఎస్ వెళ్లే ఛాన్స్ వచ్చింది. "నువు అబ్రాడ్ వెళ్లడం నాకిష్టం లేదు. అలా అయితే నేను వేరే పెళ్లి చేసుకుంటా అంది జ్యోతి .  గిరి రెండు వారాల పాటు ఆలోచిం చాడు. తను అబ్రాడ్​ వెళ్లడం వాళ్లనాన్న కోరిక తను ఇప్పుడు లేదు. కానీ నాన్న కోరిక తీర్చాలన్న తపన ఉంది. అందుకే జ్యోతిని వేరే పెళ్లి చేసుకోమని చెప్పి తను అబ్రాడ్​ వెళ్లిపోయాడు. ఆరోగ్యకరమైన బ్రేకప్ అది అందరూ అలా ఉండాలని రూలేం లేదు. ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. కానీ పరిస్థితులు ముందే ఊహించి నిర్ణయం తీసుకోవడం తప్పే కాదంటారు సైకాలజిస్ట్ నిపుణులు.

షార్ట్ ఫిలిం ప్రేమలు

వాట్సప్​ ల్లో.. ట్విటర్లో .. ఇన్​ స్ట్రాగ్రాంలో ఛాటింగలతో, మొదలైన ప్రేమ నిజ జీవితంలోకి వచ్చేసరికి వర్కవుట్ కాక విడిపోతారు కొందరు .మరికొంతమంది పరిస్థితులు అనుకూలించక వాళ్ల ప్రేమ దారులు మార్చుకుంటున్నారు. తరాల మారే కొద్దీ ప్రేమలో వైఫల్యాలు పెరుగుతూనే వస్తున్నాయి. మిలీనియం జనరేషన్​ లో  ప్రేమలో గెలిచిన వాళ్లకంటే ఓడిన వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. వాళ్లని అడిగితే దానికి కారణం పరిస్థితులే అంటున్నారు. ప్రేమ షార్ట్ ఫిల్మ్ అయినా పర్లేదు కాని జీవితం షార్ట్ కాకూడదు.

అబ్యూజింగ్ రిలేషన్ షిప్

ప్రేమలో విఫలం అయ్యేవాళ్లు కొద్ది రోజుల ముందు నుంచే వాళ్ల బంధంలో వచ్చే మార్పులు గమనిస్తుంటారు. వాళ్లు మానసికంగా దానికి ఎంత వరకూ బాధ్యులో వాళ్లే ఆలోచించుకుంటారు. ప్రేమలో కొంత దూరం ప్రయాణం చేశాక వాళ్ల అభిప్రాయాల్లో మార్పులు రావచ్చు.. లేదా బేదాభిప్రాయాలు రావచ్చు. దానికి కొన్ని కారణాలుంటాయి.. అది ప్రేమించుకుంటున్న ఇద్దరికీ సమానంగా ఉంటాయి.

ప్రేమలో ఉన్నప్పుడు కొంతమంది తమ గురించి ఇతరులకు తెలీకూడదు అనుకుం టారు. అలా అబ్బాయి కానీ, అమ్మాయి. కాని పదిమందిలో తమ పేరును వెల్లడి చేస్తే భరించలేక బ్రేకప్ చేసుకోవచ్చు. ప్రేమించినప్పుడు సన్నగా ఉంది... రెండేళ్లలో లావైపోయింది లేదా ప్రేమించినప్పుడు మంచి ఉద్యోగం ఉంది. పరిస్థితుల కారణంగా అబ్బాయి జీతం తగ్గింది ఇదో కారణం.

 

►ALSO READ | Valentine's Day 2026 : స్పెషల్ గిఫ్ట్ ఇలా ప్లాన్ చేసుకోండి.. జీవితాంతం గుర్తుండేలా.. !


బ్రేక్​ అప్​ కి  ముఖ్యమైన మరో కారణం. ఈర్ష అబ్బాయికైనా అమ్మాయికై న తమ పార్ట్​ నర్​ పట్ల ఈర్ష ఉన్నప్పుడు వాళ్లు వేరే వ్యక్తులతో చనువుగా ఉంటే భరించలేరు.ఒకరి తప్పులు ఒకరు ఒప్పు కోకపోడం మరోకారణం. ఎక్కడికైనావెళ్లాలి అనుకున్నప్పుడు ఎక్కువ సార్లు వాటిని వాయిదా వేసుకోవడం కూడా అనుమానానికి దారి తీసి బ్రేకప్ వరకూ వెడుతుంది.


కమాండింగ్ గా ఉండటం కూడా తప్పే. అది మీ అవతలి వ్యక్తికి నచ్చకపోవచ్చు. భవిష్యత్తులో ఇదే కొనసాగితే అన్న ఆలోచన వచ్చి బ్రేకప్ చెప్పేలా చేస్తుంది.అస్తమానం ఒకరి నొకరు నిందించుకోవడం, అరుచుకోవడం ఎక్కువగాఉన్నా ఆ ప్రేమ ఎక్కువ రోజులు నిలిచే అవకాశం ఉండదు.. ఒకరికొకరు ఎక్కువ రూల్స్ విధించుకోవడంఇలా నచ్చకపోతే విడిపోయేందుకు కారణాలు వెతుక్కుంటారు చాలామంది. అలా విడిపోయిన వాళ్లు చచ్చిపోనవసరం లేదు. జీవితం చాలా ఉంది.

ప్రేమ ఒక్కటే మీ కలకాదు అమ్మానాన్న మీ కోసం ఎన్నో కలలు కంటుంటారు. అవన్నీ కాకపోయినా కొన్నింటినైనా తీర్చాల్సిన బాధ్యత మీకుంటుంది. బాధ్యత కూడిన జీవితం వారను, ప్రేమను సమానంగా భరిస్తుంది